Samantha| Naga chaitanya: సమంత, నాగచైతన్య మధ్య యుద్ధం మొదలవబోతుందా ?

by samatah |
Samantha| Naga chaitanya: సమంత, నాగచైతన్య మధ్య యుద్ధం మొదలవబోతుందా ?
X

Samantha| Naga chaitanya

దిశ, వెబ్‌డెస్క్ : సమంత నటిస్తున్న తాజా చిత్రం యశోద. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో ఆగస్టు 12 గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. యశోద చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, సమంత(Samantha) మాజీ భర్త నాగ చైతన్య(Naga chaitanya) బాక్సాఫీస్ వద్ద ఆమెను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బాలీవుడ్ బిగ్గీ లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్(Aamir Khan), కరీనా కపూర్(Kareena Kapoor) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ బిగ్గీలో నాగ చైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. అమీర్ ఖాన్ సినిమా కావడంతో లాల్ సింగ్ చద్దా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అంటే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద పరోక్షంగా నాగ చైతన్యతో సమంత తలపడనుంది. మరోవైపు, అఖిల్ అక్కినేని తన రాబోయే చిత్రం ఏజెంట్‌ను ఆగష్టు 11 న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదే జరిగితే, థియేటర్లలో నాగ చైతన్య, అఖిల్, సమంతల వార్ మాములుగా ఉండదు అంటున్నారు అక్కినేని అభిమానులు.

Next Story