సెల్ఫీ అడిగిన వృద్ధురాలితో విజయ్ సేతుపతి షాకింగ్ బిహేవియర్.. వీడియో వైరల్

by Disha Web Desk 7 |
సెల్ఫీ అడిగిన వృద్ధురాలితో విజయ్ సేతుపతి షాకింగ్ బిహేవియర్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన ట్యాలెంట్‌తో ఇండస్ట్రీలో కష్టపడి విలక్షణ నటుడిగా ఎదిగాడు విజయ్ సేతుపతి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రజంట్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న విజయ్‌కు పెద్దలంటే ఎంతో గౌరవం. వయసులో పెద్దవారు ఎక్కడ కనిపించిన వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇతడికి సంబంధించిన ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.

ఈరోజు తమిళనాట లోక్‌సభ ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి స్టార్ట్ అయిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ స్టార్స్ సైతం పోలింగ్ కేంద్రల వద్ద క్యూ కట్టారు. ఈ మేరకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రానికి రాగా.. వీల్ చైర్‌లో నడవలేని ఓ వృద్ధురాలు అతడిని చూసి సెల్ఫీ అడిగింది. వెంటనే అతడు ఆమె కాలుకు నమస్కారం పెట్టి కిందకి కూర్చుని సెల్ఫీ తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే.. విజయ్ సేతుపతి సింప్లిసిటీపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed