‘కేసీఆర్’ సినిమాను ఎలక్షన్ కమిషన్ ఆపేసింది.. రాకింగ్ రాకేష్ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

by Disha Web Desk 6 |
‘కేసీఆర్’ సినిమాను ఎలక్షన్ కమిషన్ ఆపేసింది.. రాకింగ్ రాకేష్ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న పిల్లలను తన స్కిట్‌లో పెట్టి ప్రేక్షకులను అలరించేవాడు. ఇక ఇటీవల యాంకర్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రాకేష్ హీరోగా మారడంతో పాటు తానే ప్రొడ్యూస్ చేస్తూ కేసీఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. కేసీఆర్ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రం విడుదలను ఎలక్షన్ కమిషన్ ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజాగా, దీనిపై రాకింగ్ రాకేష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘‘నా సినిమాని నవంబర్ 17న లేదా 24న రిలీజ్ చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఎలక్షన్ కమిషన్… ఎన్నికల సమయంలో ప్రజలను ప్రేరేపించే ఏ రాజకీయ సినిమా రిలీజ్ కాకూడదు అని చెప్తూ నా సినిమా విడుదలను ఆపేసింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, చట్టం ప్రకారమే నా సినిమా రిలీజ్ ఆగింది. ఇది కూడా నా మంచికే అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకునే టైమ్ దొరికింది’’ అని చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed