అవి కనిపించకుండా చేస్తే మహిళను అది మాత్రమే రక్షిస్తుంది.. అనసూయ ట్వీట్

by Disha Web Desk 6 |
అవి కనిపించకుండా చేస్తే మహిళను అది మాత్రమే రక్షిస్తుంది.. అనసూయ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయకు పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా నటిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఆమె ఇటీవల విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2లో కీలక పాత్రలో నటిస్తుంది.

అయితే అనసూయ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంది. తాజాగా, అనసూయ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘‘ ఇల్లు, దుస్తులు, ఇంటి గోడలు, తలుపులతో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడ గలవు. కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది’’ అంటూ రామాయణంలోని ఓ కొటేషన్ షేర్ చేసింది. దీంతో అది చూసిన వారు అనసూయకు ఏమైందని రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed