సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న ‘టెంపర్’ బ్యూటీ.. భర్తకు ముద్దులిస్తూ ఫొటోలు.. షాక్‌లో యువత!

by Disha Web Desk 7 |
సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న ‘టెంపర్’ బ్యూటీ.. భర్తకు ముద్దులిస్తూ ఫొటోలు.. షాక్‌లో యువత!
X

దిశ, సినిమా: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నటీనటులు బ్యాచులర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి.. వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన యంగ్ బ్యూటీ సడెన్‌గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు.. అపూర్వ శ్రీనివాసన్.

ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు బ్యూటీ అపూర్వ శ్రీనివాసన్. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కు, నటనకు మంచి మార్కులే సొంతం చేసుకుంది. ఇక తర్వాత ‘జ్యోతిలక్ష్మి, ఎక్కిడికి పోతావు చిన్నవాడా, విన్నర్, తొలిప్రేమ, కవచం, ప్రేమకథా చిత్రమ్2’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సడెన్‌గా ఎటువంటి ఇన్ఫర్‌మేషన్ లేకుండా పెళ్లి చేసుకుని యువతకు షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఫైలట్‌గా ఉద్యోగం చేస్తున్న అపూర్వ.. శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. పెళ్లి విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఇంత చిన్న వయసులో పెళ్లి చేసేసుకుందేంటి అంటూ యువత నిరుత్సాహ పడుతున్నారు.


Next Story