తెలుగు ప్రేక్షకుడి చూపు.. మలయాళ సినిమాల వైపు! అంతలా ఆదరించడానికి కారణమేంటి..? (వీడియో)

by Disha Web Desk |
తెలుగు ప్రేక్షకుడి చూపు.. మలయాళ సినిమాల వైపు! అంతలా ఆదరించడానికి కారణమేంటి..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్నేళ్లుగా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు మలయాళం మూవీస్‌పై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ అయ్యే మలయాళ సినిమాలకు వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీలో మలయాళ సినిమాకు డిమాండ్ పెరిగింది. ఇంతకు ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోని మలయాళ సినిమాలను అక్కడి డైరెక్టర్స్, యాక్టర్స్ టాలెంట్, క్రియేటివిటీ, డిఫరెంట్ కథలు మెయిన్ స్టీమ్‌కు తీసుకొచ్చాయి. మలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగేలా చేశాయి. అక్కడి యాక్టర్స్, డైరెక్టర్స్‌కు అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఇంతకీ మలయాళం సినిమాల్లో ఏముంది? ఎందుకు అంతలా. ఆదరిస్తున్నారు?

మన వాళ్లు చాలా మంది ఈ మధ్య ఓ మలయాళం సినిమా చూశాను. చాలా బాగుంది. ఫలానా ఓటీటీలో వచ్చింది చూడండి అని చెప్పుకుంటున్నారు. మలయాళం సినిమా అంటే ఏ థియేటర్ అని అడగడం మానేసి ఏ OTT అని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమిటి ఈ మలయాళం పిచ్చి, పొరుగింటి పుల్లకూరపై మోజా అంటే అది కాదు. ఎందుకంటే పొరుగు భాషలు మనకు చాలా ఉన్నాయి.మలయాళం ఒక్కటే కాదు కదా. పేరున్న ఓటీటీ సంస్థలు సైతం మలయాళంలో వస్తున్న సినిమాలపై ఓ కన్నేస్తున్నాయి. ఎక్కువ రేటుకుకొంటున్నాయి. కేవలం మోహన్ లాల్ లేదా మమ్ముట్టి వంటి స్టార్స్‌కు మాత్రమే మార్కెట్ అనుకుంటే పొరపాటు. ఫహాద్ ఫజిల్, పృద్వీరాజ్ సుకుమారన్ దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి స్టార్స్‌కు ఇక్కడ ఓటీటీలలో బ్రహ్మరథం పడుతున్నారు.

మీకు గుర్తుందో లేదో ఒకప్పుడు మలయాళం సినిమాలు అంటే అడల్ట్ సినిమాలు. ఆ సినిమాలను ఇక్కడ బి-గ్రేడ్ ప్రొడ్యూసర్స్ డబ్ చేసి డబ్బులు చేసుకునేవాళ్లు. మిగతావాళ్ళు వాటిని పట్టించుకునే వారే కాదు. కానీ గత కొన్నాళ్లుగా కేరళ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. మలయాళ సినిమా అంటే అడల్ట్ సినిమా అనుకునేస్థితి నుంచి ఇంటలెక్చువల్ సినిమా అనేస్థాయికి వచ్చాయి. అన్ని జోనర్స్‌లోనూ తక్కువ బడ్జెట్లోనే భారీ హిట్ సినిమాలు | రూపొందిస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకు కరోనా టైం ఆజ్యం పోసిందని చెప్పాలి. ఆ టైంలో థియేటర్స్ క్లోజ్ అయ్యి ఓటీటీలకు ఊపిరి పోసింది. ఒకతెలుగు ఓటీటీలో అయితే కేవలం మలయాళ డబ్బింగ్ సినిమాలకే ప్రయారిటీ ఇచ్చారు.

మొదట్లో ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. తర్వాత మెళ్లగా హ్యూమన్ యాంగిల్ని ఎలివేట్ చేయటం, సహజంగా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను తెరకెక్కించటం అవి మనవాళ్లకు నచ్చటం మొదలయ్యాయి. ఇంట్లో ఫ్యామిలీ కూర్చుని ఫ్రీగా చూస్తున్నాం అని ఫీలింగ్ కు హీరోలు అవసరం లేకపోయింది. దాంతో మలయాళంలో ఇంతమంచి సినిమాలు వస్తున్నాయా? అని మనవాళ్లంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి మలయాళం నుంచి పాన్ ఇండియా మూవీస్ రావటం లేదు. అయితే కంటెంట్ పరంగా, స్క్రిప్ట్ పరంగా ది బెస్ట్ మూవీస్ అందిస్తోంది ఆ సినిమా ఇండస్ట్రీ. ఈ మధ్యకాలంలో మాలికాపురం, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, నాన్ పాకల్ నేరతు మయక్కమ్, తంకం, పడవెట్టు, జనగణమన, ఒరు తెక్కన్ తల్లు కేస్, సెల్యూట్, వండర్ విమెన్, జయజయజయ జయహే, రొమాంచం, ప్రణయ విలాసం. ఖాళీ పర్స్ బిలియనీర్స్, పురుష ప్రేతమ్ లాంటి సినిమాలు మనవాళ్లకు తెగ నచ్చేశాయి. వీటన్నిటిలో ఉన్నది కేవలం రొటీన్‌ని బ్రేక్ చేసే కొత్త కాన్సెప్టు మాత్రమే.

ఈ మలయాళం సినిమాలపై ఆసక్తి ఎంతదాకా వెళ్లిందంటే.. తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడటానికి జనాలు బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడా ఓ తలనొప్పి ఉంది. మలయాళంలో ఎప్పుడో రిలీజ్ అయి యావరేజ్‌గా అనిపించుకున్న సినిమాలను తెలుగులో కావాలని మరి డబ్ చేసి OTT లలో రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య వరుసపెట్టి వచ్చిన చాలా సినిమాలు అలా వచ్చినవే. అయితే అలవాటు పడ్డ ప్రాణం కదా అందుకే ఆడియన్స్ కూడా ఆ సినిమాల మీద ఆసక్తి చూపిస్తూ వాటిని తెగ చేసేస్తున్నారు. అయితే మలయాళీ సినిమాలు ఆదరణ పొందడానికి వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం కూడా ఒక కారణమే.

వాస్తవానికి బాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమాలు తీస్తారు. కానీ వాళ్లు ఎక్కువగా బయోపిక్ లేక్ పరిమితం అయ్యారు. కానీ, మాలీవుడ్‌లో నిజంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన రాజేష్ పిళై సినిమా ట్రాఫిక్ అలాంటిదే. హృదయాన్ని కరిగించే ఒక వాస్తవ కథ ఆధారంగా " రాసుకున్న స్టోరీ ఇది. 2017లో వచ్చిన టేకాఫ్, 2019లో వైరస్ సినిమాలు కూడా ఇలా వచ్చినవే. ఇవేకాదు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే మనవాళ్ళు మలయాళం సినిమాల మీద అంత ప్రేమ చూపిస్తున్నారన్నమాట.

Next Story

Most Viewed