మతిస్థిమితం కోల్పోయి గుడిలో చిరిగిన బట్టలు, గడ్డంతో స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్!

by Disha Web Desk 8 |
మతిస్థిమితం కోల్పోయి గుడిలో చిరిగిన బట్టలు, గడ్డంతో స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : దిశ, సినిమా : తమిళ నటుడు ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ అందింది. లవ్ స్టోరీ మూవీ సక్సెస్ తర్వాత ధనుష్‌తో శేఖర్ కమ్ముల మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న కుబేర మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మూవీ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. పాత బట్టలు, గడ్డం, చెదిరిన జుట్టుతో గుడి ముందు ఉన్న ధనుష్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ .. ఏంటీ ధనుష్ ఇలా మారిపోయాడు..సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ధనుష్, శేఖర్ కమ్ముల కుబేర మూవీతో హిట్ కొట్టడం ఖాయం అంటూ ముచ్చటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story