ఆ విషయంలో అస్సలు రాజీపడను : Taapsee Pannu

by Dishaweb |
ఆ విషయంలో అస్సలు రాజీపడను : Taapsee Pannu
X

దిశ, సినిమా: స్టార్ నటి తాప్సీ పన్ను తన బ్యూటీ సీక్రెట్‌ గురించి ఓపెన్ అయింది. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న నటి మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి నిద్ర దగ్గర అస్సలు కాంప్రమైజ్‌ కాలేదు. 8 గంటలు నిద్ర పోవాల్సిందే. స్కిన్‌ కేర్‌లో క్లెన్సింగ్‌, మాయిశ్చరైజింగ్‌, హైడ్రేటింగ్‌ తప్పనిసరి. ఇక జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ మా అమ్మదే. కర్లీ హెయిర్‌ మేనేజ్‌ చేయడం ఎంత కష్టమో అందరికి తెలుసు. అందుకని నా జుట్టుకోసం కొబ్బరి నూనె, మందార ఆకులు, ఉసిరి వంటి ఇన్‌గ్రీడియెంట్స్‌‌తో స్పెషల్‌ ఆయిల్‌ తయారు చేస్తుంది. ఆ ఆయిల్‌ని రోజూ రాత్రి తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేస్తాను. అందుకే కర్లీ హెయిర్‌ అయినా కాస్త సిల్కిగా కనిపిస్తుంది. ఆ క్రెడిట్ మొత్తం మా అమ్మకే’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.

Read more:

భర్తకు దూరమయ్యాక వాటికి దగ్గరవుతోన్న మెగా డాటర్.. పిక్స్ వైరల్


Next Story