తిరుమలేశుడి సన్నిధిలో Superstar Rajinikanth .. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పూజలు

by Nagaya |
తిరుమలేశుడి సన్నిధిలో Superstar Rajinikanth .. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పూజలు
X

దిశ ఏపీ బ్యూరో: సూపర్ స్టార్ రజనీకాంత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం.. ఆలయ అర్చకులు రజనీకాంత్ కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. రజనీకాంత్‌ ఇవాళ కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతో పాటు ఏఆర్‌ రెహమాన్‌ కూడా వెళ్లనున్నారు. కాగా.. శ్రీవారి దర్శనం కోసం రజినీకాంత్‌ బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. టీఎస్‌ఆర్‌ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఓఎస్డీ రామకృష్ణ స్వాగతం పలికారు.

Also Read...

అదే నా చివరి సినిమా: మంత్రి ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ డెసిషన్

Next Story