ఏకంగా 12 ఎకరాల్లో హాస్పిటల్స్ నిర్మించబోతున్న సూపర్ స్టార్!

by Anjali |
ఏకంగా 12 ఎకరాల్లో హాస్పిటల్స్ నిర్మించబోతున్న సూపర్ స్టార్!
X

దిశ, సినిమా: కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం రజనీ జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేదాతీయన్’ చిత్రంలో నటిస్తున్నాడు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. ప్రస్తుతం ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతున్నట్లు సమాచారం.

ఈ షూటింగ్ లో రానా, రితికా సింగ్, రజనీకాంత్ తదితరులు పాల్గొంటున్నారట. ఇదంతా పక్కన పెడితే ఈ హీరో గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకున్న తలైవా కోరిక నేరవేరలేదు కాబట్టి.. ఇప్పుడు ప్రజల కోసం ఏదైనా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇందుకోసం రజనీ పేదల కోసం ఏకంగా 12 ఎకరాల్లో భారీ హాస్పిటల్స్ కట్టబోతున్నారట.

రజనీకాంత్ పేదలకు అవసరమైన విద్య వైద్యం మీద దృష్టిపెట్టబోతున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ ఆల్రెడీ కొత్తగా భూమి కొనుగోలు చేసి చెన్నైలోని తిరుప్పోరూర్‌లో రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారట. చెన్నై ఓఎంఆర్ రోడ్డు నుంచి దల్హంపూర్ వెళ్లే దారిలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, డీడీ నమోదు చేసేందుకు రజినీ తిరుపోరూర్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లడంతో ఈ విషయం బయటపడినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed