ఎల్లప్పుడూ నా బెస్ట్ అంటూ గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన స్టార్ సింగర్ రాహుల్.. మరి రతిక పరిస్థితి ఏంటీ?

by Disha Web Desk 6 |
ఎల్లప్పుడూ నా బెస్ట్ అంటూ గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన స్టార్ సింగర్ రాహుల్.. మరి రతిక పరిస్థితి ఏంటీ?
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ రాహుల్‌కు పరిచయం అక్కర్లేదు. మొదట ఆయన యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జానపద పాటలు, సినిమా సాంగ్స్ పాడి అందరి హృదయాలను కొల్లగొట్టాడు. అలాగే బిగ్‌బాస్ షోలో సీజన్-3 పాల్గొని విన్నర్‌గా కప్ గెలుచుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు రాహుల్ నటి పునర్నవితో కాస్త చనువుగా ఉండటంతో ప్రేమించుకుంటున్నారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వారిద్దరూ స్పందించి మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాహుల్, బిగ్‌బాస్ కంటె‌స్టెంట్ రతిక రోజ్ ప్రేమించుకున్నట్లు ఏవో కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నట్లు ఇటీవల సీజన్-7లో ఆమె రివీల్ చేసి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం రాహుల్ సూపర్ సింగర్ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. రాహుల్ తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. అష్షు రెడ్డితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి ‘‘ఎల్లప్పుడూ నా బెస్ట్’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే అష్షు కూడా అదే పోస్ట్ షేర్ చేయడంతో అది చూసిన వారంతా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఓ నెటిజన్ ఏకంగా అడ్వాన్స్‌గా మ్యారిడ్ లైఫ్ అని చెప్పుకొచ్చాడు. అలాగే మరికొంత మంది వరల్డ్ ఫేమస్ లవర్ నీకే సెట్ అవుతుంది. ఈ పోస్ట్ చూస్తే రతిక ఏమైపోతుంది అంటూ పలు రకాల కామెంట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉందంటూ దారుణంగా అంటున్నారు.

Read More..

ఎలా చేస్తావు.. టబ్ లో చేయడం ఇష్టమేనా..? నటుడిని ఓపెన్ గా అడిగేసిన రీతూ చౌదరిNext Story

Most Viewed