కేటీఆర్ పోస్ట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. అసలు ఏం జరిగిందంటే?

by Disha Web Desk 6 |
కేటీఆర్ పోస్ట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ సుపరిచితమే. ఆయన నిత్యం ఇతర పార్టీలపై పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ తగ్గేదెలా అన్నట్లు ప్రవర్తిస్తారు. అయితే కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారు.

అంతేకాకుండా ఎవరైనా సహాయం కోరితే కాదనకుండా చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కేటీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. కానీ చిరునవ్వుతో ఎదుర్కోవాలి’’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఇక ఈ పోస్ట్‌పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది. అంతేకాదు కేటీఆర్ పోస్ట్‌కు సామ్ స్పందించడంతో నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed