ముద్దు సీన్‌లు ఆ హీరోయిన్‌కు కలిసి రావట్లేదు.. అందుకే ఆ సినిమాలు ఫ్లాప్!

by Hajipasha |
ముద్దు సీన్‌లు ఆ హీరోయిన్‌కు కలిసి రావట్లేదు.. అందుకే ఆ సినిమాలు ఫ్లాప్!
X

దిశ, సినిమా: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి కథలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఇటీవల 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే అమ్మడికి తెలుగు‌లో ఆఫర్లు తగ్గిపోయాయి. అయితే దీనికి కారణం ఆమె ఆలోచించకుండా నటించిన కొన్ని చిత్రాలు అందులో ముద్దు సీన్‌ల కారణం అని అంటున్నారు. అవును రాశి ఖన్నా ఏ సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని దృష్టి లోకి తీసుకొని నెటిజన్లు 'అవును.. తెలుగులో జిల్‌, జోరు, బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, వరల్డ్ ఫేమస్ లవర్, థ్యాంక్యూ మూవీస్‌ అన్నింటిలో రాశీఖన్నా లిప్ లాక్ సీన్‌లు ఉన్నాయి. అందుకే ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : హన్సిక 'లవ్‌ షాదీ డ్రామా' ట్రైలర్‌!

Next Story