ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Hamsa |
ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తాతయ్య నరేంద్రన్ రజ్దాన్ (93) గురువారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ తాతయ్య.. నువ్వే నా హీరో 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు. మొన్నటి వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నా కోసం రుచికరమైన ఆమ్లెట్ వేసిచ్చేవాడివి. నాకు బోలెడన్ని కథలు చెప్పెవాడివి. వయెలిన్ వాయించేవాడివి. ఇప్పుడు నువ్వు లేవన్న బాధతో నా మనసంతా దుఖంతో నిండిపోయింది. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించాడు. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్లీ కలుసుకునే వరకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటాను’’ అంటూ రాసుకొచ్చింది. దానికి ఇటీవల బర్త్‌‌డే సెలబ్రేషన్ వీడియోను జత చేసింది.

Also Read: నెట్టింట ఇంట్రెస్టింగ్ కొటేషన్ షేర్ చేసిన రష్మిక.. ప్రియుడికోసమేనా?

Next Story

Most Viewed