నెట్టింట ఇంట్రెస్టింగ్ కొటేషన్ షేర్ చేసిన రష్మిక.. ప్రియుడికోసమేనా?

by Anjali |
నెట్టింట ఇంట్రెస్టింగ్ కొటేషన్ షేర్ చేసిన రష్మిక.. ప్రియుడికోసమేనా?
X

దిశ, సినిమా: స్టార్ నటి రష్మిక మందన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక కొటేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు ఇంటి ఆవరణలో చేతిలో ఒక రకమైన పింక్ కలర్ పువ్వును పట్టుకుని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే ఆ పిక్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘కోలుకో.. నేర్చుకో.. ఎదుగు.. ప్రేమించు’ అంటూ నాలుగు పదాలను రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు గతంలోనూ నిరాశలను వదిలి ముందుకు వెళ్లాలని, జీవితంలో ఎదురైన ప్రతి విషయం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలంటూ నటి చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదో అంతర్గత సమస్యతో రష్మిక బాధపడుతుందని, తన ప్రియుడికి ఇండైరెక్ట్‌గా ఇలాంటి కొటేషన్లతో పాఠాలు నేర్పిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..

పెళ్లికి అవి చాలా ముఖ్యం.. వాటికి నేను రెడీగా లేను..! హీరోయిన్ పోస్ట్ వైరల్

Next Story

Most Viewed