స్టార్ హీరో విజయ్‌కు ప్రమాదం.. దెబ్బలతో ఉన్న ఫొటోలు వైరల్

by Disha Web Desk 7 |
స్టార్ హీరో విజయ్‌కు ప్రమాదం.. దెబ్బలతో ఉన్న ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ‘ద గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

ఈరోజు తమిళనాట లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి స్టార్ట్ అయిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ స్టార్స్ సైతం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో విజయ్ దళపతి కూడా తన ఓటు హక్కను వినియోగించుకునేందుకు అక్కడకు వచ్చారు. అయితే.. ఆయనను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ఓటు వెయ్యడానికి వచ్చిన విజయ్ చేతికి గాయం ఉంది.

అది గమనించిన అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు విజయ్‌కు ఏమైయుంటుంది అని ఆరా తియ్యగా.. సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. రష్యాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విజయ్ గాయపడినట్లు వినికిడి. ఈ కారణం చేతనే విజయ్ చాలా డల్‌గా, బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed