పవన్ కళ్యాణ్‌కు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు.. ఫ్యాన్స్‌ ఆదుకుంటారా? ముంచేస్తారా?

by Dishanational2 |
పవన్ కళ్యాణ్‌కు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు.. ఫ్యాన్స్‌ ఆదుకుంటారా? ముంచేస్తారా?
X

దిశ, సినిమా : మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో ముందుండే శ్రీరెడ్డి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ గురించి ట్వీట్ చేసింది. అటు సినిమా, ఇటు రాజకీయాలు.. రెండింటితోనూ బిజీబిజీగా గడుపుతున్న జనసేనాని లోలోపల చాలా మదనపడుతున్నాడని చెప్పుకొచ్చింది. ‘తన కోసం ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు అని సంతోషపడాలో, లేకపోతే రేపు వీళ్లు అందరు తనకి ఓటు వెయ్యరు అని బాధపడాలో.. పవన్ కళ్యాణ్‌కు అర్థం కావట్లేదు. పాపం ఇంత కష్టం పగోడికి కూడా రాకూడదు అయ్యా’ అని రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘పవన్‌కు ప్రాణం ఇస్తాం. జగన్‌కు ఓటేస్తాం’ అని ఫ్యాన్స్ చాలా క్లారిటీతో ఉన్నారని అంటున్నారు.

Read More : సంచలన సర్వే: వైసీపీ విజయదుందుభి, టీడీపీ గెలిచేస్థానాలేన్నంటే!



Next Story

Most Viewed