పెళ్లిపై స్పందించి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సిద్ధార్థ్- అదితి.. ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్‌లో ఫ్యాన్స్!

by Disha Web Desk 6 |
పెళ్లిపై స్పందించి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సిద్ధార్థ్- అదితి.. ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: హీరోయిన్ అదితి రావు హైదరీ- సిద్ధార్థ్ పేరు నిన్నటి నుంచి నెట్టింట మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా డేటింగ్ ఉన్న వీరిద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు రావడంతో అంతా ఒక్కసారిగా షాక్‌లో పడిపోయారు. అయితే సిద్దు-అదితి మార్చి 27న తెలంగాణలో వనపర్తిలోని రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు తమిళనాడు నుంచి పురోహితులు హాజరయి పెళ్లి తంతును పూర్తి చేశారట. అయితే వీరి పెళ్లికి సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు టాక్. కానీ వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు.

అయినప్పటికీ సిద్ధార్థ్-అదితికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, సిద్ధార్థ్- అదితి రావు హైదరీ నేడు తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇద్దరు ఒకే పోస్ట్ పెట్టి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు. అతను ఒకే చెప్పడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాము అని అదితి రాసుకొచ్చింది. అంతేకాకుండా రింగ్ పెట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేసింది. అలాగే సిద్ధార్థ్ కూడా ఆమె ఎస్ చెప్పడంతో నిశ్చితార్థం చేసుకున్నామని సేమ్ ఫొటోను పెట్టాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కొందరు షాక్ అవుతున్నారు. పుకార్లు అనుకుంటే మీరు అందరూ అనుకున్నదే చేశారుగా అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అలాగే మరికొందరు మాత్రం ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed