Shruti Haasan : పట్టుచీరలో పద్ధతిగా మెరిసిపోతున్న శృతిహాసన్..!

by Anjali |
Shruti Haasan : పట్టుచీరలో పద్ధతిగా మెరిసిపోతున్న శృతిహాసన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ శృతి హాసన్. అగ్ర హీరోల సరసన నటిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకుంది. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ చిత్రాలతో శృతి హాసన్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకున్నారు. అల్రెడీ ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగా..

శృతిహాసన్ సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తోంది. తాజాగా చెన్నైలో ‘కాంచీపురం వరమహాలక్ష్మి సిల్స్’ కోసం యాడ్ షూట్ చేసింది. ఈ క్రమంలో తను పట్టు శారీ కట్టుకుని స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. పట్టుచీర, ఆకర్షణీయమైన జ్యూవెలరీ ధరించి ఈ ముద్దుగుమ్మ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ స్టార్ సంప్రదాయ దుస్తుల్లో నిండుగా దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఆమెను చూసేందుకు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed