మన టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తెలిస్తే షాక్..

by Dishafeatures1 |
మన టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తెలిస్తే షాక్..
X

దిశ,సినిమా:ప్రస్తుత కాలంలో నెంబర్ వన్ హీరో అంటే కంటిన్యూగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ ను కొడుతూ క్రేజ్ ని పెంచుకునేవారు.ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరంటే ఎన్టీఆర్.. ఆ తర్వాత చిరంజీవి. ప్రస్తుతం అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. వీరిలో నెంబర్ వన్ ఎవరు? టాప్ 10 ఎవరో తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయాలు సేకరించి టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తేల్చింది..అయితే ఆ లిస్ట్ ని ఒకసారి చూద్దాం.

*ఛత్రపతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి బాహుబలి వంటి చిత్రాలతో ఇండియా వైడ్ తెచ్చుకున్న మన డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా ఈ సర్వే తేల్చింది.

*ఇక రెండో స్థానం హీరో మహేష్ బాబుది. ఆయన ఒక్క పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ ఆ స్థానంలో ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.




*మరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.

*ఇక నాలుగవ స్థానంలో ఎన్టీఆర్ ఉన్నాడు.అతను చేసిన ఆర్ ఆర్ ఆర్ తో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడు అనేది మన అందరికీ తెలిసిన విషయమే.

* మరో ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్ కి ఐదవ స్థానం దక్కింది. ఆయన టాప్ ఫైవ్ లో నిలిచాడు.

* రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఆరో స్థానానికి పరిమితం అయ్యారు. ఏడవ స్థానంలో నాని, ఎనిమిదవ స్థానంలో రవితేజ ఉన్నారు.

*ఇక విజయ్ దేవరకొండ కు తొమ్మిదవ స్థానం దక్కగా, పదవ స్థానంలో చిరంజీవి నిలిచారు.


Next Story

Most Viewed