భార్యతో బెస్ట్ నైట్‌పై చర్చ.. చెబితే సిగ్గుతో చనిపోతారన్న షాహిద్ (వీడియో)

by Disha Web Desk 6 |
భార్యతో బెస్ట్ నైట్‌పై చర్చ.. చెబితే సిగ్గుతో చనిపోతారన్న షాహిద్ (వీడియో)
X

దిశ, సినిమా: స్టార్ హీరో షాహిద్ కపూర్, రిపోర్టర్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘బ్లడీ డాడీ’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న షాహిద్‌ను తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో 'ఏక్ రాత్ కి కహానీ’ గురించి చెప్పమని విలేఖరి అడిగాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన హీరో వెంటనే ‘ముందు మీ రాత్రుల గురించి చెప్పండి’ అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తుండగా మళ్లీ వివరంగా చెప్పుకొచ్చిన షాహిద్.. ‘ప్రతి రాత్రికి ఒక గొప్ప కథ ఉంటుంది. మీకు, నాకు గుర్తుండిపోయే మంచు రాత్రి ఉండే ఉంటుంది. కాబట్టి మీరు స్టోరీ గురించి మాకు చెప్పడానికి సిగ్గు పడుతున్నారు. మీరు చేసిన చిలిపి పనులు మీ మనసులోనే ఉంటాయి. మనలాగే ‘బ్లడీ డాడీ’కి కూడా ఓ మంచి కథ ఉంది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా జూన్ 9న జియో సినిమాలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read: ప్రభాస్ సినిమాని ‘ఛీ’ కొట్టిన చిరంజీవి..

Next Story