నగ్నంగా సమయం కేటాయించినందుకు గర్వపడుతున్నానంటూ.. హీరో సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
నగ్నంగా సమయం కేటాయించినందుకు గర్వపడుతున్నానంటూ.. హీరో సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో విద్యుత్ జమ్వాల్ పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో హిమాలయాల్లో నగ్నంగా ఉన్న ఫొటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలో విద్యుత్ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దీంతో వాటిని చూసిన కొందరు విమర్శించగా.. మరికొందరు సపోర్ట్‌గా నిలిచాడు. అంతేకాకుండా నెట్టింట దారుణంగా ట్రోల్ చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యుత్ తన నగ్న ఫొటోలపై వచ్చిన ట్రోల్ గురించి స్పందించాడు. మీ నగ్న ఫొటోలపై వచ్చిన ట్రోల్స్‌కు మీరు బాధపడ్డారా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి విద్యుత్ స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి చిన్న విషయాలు దోమ కుట్టినట్లు అనిపిస్తాయి. ఇలాంటి విమర్శలు నన్ను ఏ విధంగా బాధించవు. అది నా గురించి ఒకరి అభిప్రాయం అంతే.

ఇవన్నీ పట్టించుకుంటే ముందుకు సాగలేం కాబట్టి పట్టించుకోను. ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నగ్నంగా ఉండి తమ కోసం సమయం కేటాయించకూడదు. మీరు అలా చేస్తే ఈ ప్రపంచంలోనే సిగ్గుపడని ఏకైక వ్యక్తి మీరు మాత్రమే అవుతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విద్యుత్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.


Next Story

Most Viewed