2023 Cannes Film Festival: మొదటి ప్రాంతీయ జానపద కళాకారిణి.. అబ్బురపరిచిన Sapna Choudhary

by Disha Web Desk 17 |
2023 Cannes Film Festival: మొదటి ప్రాంతీయ జానపద కళాకారిణి.. అబ్బురపరిచిన Sapna Choudhary
X

దిశ, సినిమా: బిగ్ బాస్-ఫేమ్, హర్యాన్వీ డ్యాన్సర్ సప్నా చౌదరి.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. ఇక ఈ ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో భారతదేశం నుంచి పాల్గొన్న మొదటి ప్రాంతీయ జానపద కళాకారిణిగా నిలిచిన సప్నా.. ఇంగ్లీష్ కూడా తెలియకుండానే ఈ అంతర్జాతీయ వేదికపై ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పింది.

‘కేన్స్ 2023. కలలు నిజంగా నిజమవుతాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేయడం ఒక అద్భుతమైన అనుభవం. నేను రెడ్ కార్పెట్‌పై నడవడం నమ్మశక్యం కానిది. ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది ప్రతిభావంతులైన కళాకారులతో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇది త్యాగం, కృషి, చెమట, సంకల్పంతో నిండిన సుదీర్ఘ ప్రయాణం. దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అలాగే @airfrance సహకారంతో రెడ్ కార్పెట్‌పై నడిచినందుకు చాలా థ్రిల్‌గా ఉన్నాను’ అంటూ సంబరపడిపోయింది.

Next Story

Most Viewed