విడాకుల తర్వాత మొదటిసారి అక్కినేని ఇంట్లో సామ్.. ఫోటో వైరల్

by Dishanational2 |
విడాకుల తర్వాత మొదటిసారి అక్కినేని ఇంట్లో సామ్.. ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత, నాగచైతన్య విడిపోయి సంవత్సరం కావస్తోంది. అయినా వీరిపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఎప్పుడూ వీరిపై గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతే కాకుండా అప్పుడప్పుడు అక్కినేని ఫ్యామిలీపై కూడా గాసిప్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అది పాత వీడియోనో, కొత్త వీడియోనో తెలియదు కానీ, దానిపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.

ఇవి కూడా చదవండి : అందాల తార శ్రీదేవి గురించి నమ్మలేని నిజాలు ఇవే?


విడాకుల తర్వాత మొదటి సారి అక్కినేని నాగార్జున ఇంట్లో సమంత ఫోటోలు దర్శనం ఇచ్చాయి. అది ఎలా అనకుంటున్నారా..? అక్కినేని నాగార్జున, అఖిల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అడ్వర్టైజ్ మెంట్ చేశారు. అందులో అఖిల్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంటే టక్కున నాగార్జున గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా అంటూ అడగడం దానికి సంబంధించిన వివరాలను అఖిల్ చెప్తుంటాడు. ఈ క్రమంలోనే నాగార్జున చేతిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాగ్ ఉంటుంది. దీంతో ఆ బ్యాగ్ ని చూసి అఖిల్ నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ నా.. అంటే నాగార్జున రేయ్ నాకు ఉండేది ఒక్కతే గర్ల్ ఫ్రెండ్ రా అంటూ ఆ బ్యాగ్ ని అఖిల్ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. అయితే ఆ బ్యాగ్‌పై సమంత ఫొటో ఉంటుంది. ఇక ఇది చూసిన వారందరూ విడాకుల తర్వాత మొదటి సారి నాగార్జున ఇంట్లో సమంతని చూడటం అంటుంటే, మరికొందరు సమతను దూరం పెట్టారుగా, ఈ విధంగా దగ్గరికి తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సామ్, చై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తో సహా చాలా యాడ్స్ చేసిన విషయం తెలిసిందే.

Read Disha E-paper

Next Story

Most Viewed