అందాల తార శ్రీదేవి గురించి నమ్మలేని నిజాలు ఇవే?

by Dishanational2 |
అందాల తార శ్రీదేవి గురించి నమ్మలేని నిజాలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్ : అతిలోక సుందరి, దివికేగిన దేవకన్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన కళ్లు తామర రేకులు, ఎంతో అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. రెండు తరాలతో ఈ అమ్మడు ఆడిపాడింది.

అప్పట్లో కుర్రకారుకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం. సినిమాలు చేస్తూ లైఫ్‌లో మంచి సక్సెస్ సాధించి, బాలీవుడ్‌లో తన సత్తుచాటుకుంది ఈ అందాల తార. బాలీవుడ్‌లో సైతం అగ్ర హీరోల సరసన ఆడి పాడి, మంచి గుర్తింపు తెచ్చుకొని, అక్కడే, బోనీకపూర్‌ను ప్రేమ వివాహం చేసుకొని సెట్ అయ్యింది.

అయితే ఆమె పర్సనల్ లైఫ్‌గురించిన ఆసక్తికర విషయాలు వెళ్లడించారు సీనియర్ సినీ విశ్లేషకులు. తాను బోనీకపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొందంట. ఒక రోజు శ్రీదేవి ఆయనతో మాట్లాడుతూ.. నమ్మి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుంటే నిండా మునిగిపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిందంట. నెలకు 25 లక్షల వడ్డీ కడుతున్నా, ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా అంటూ వాపోయిందని తెలిపారు. అంతే కాకుండా బోనీకపూర్ మొదటి భార్య శ్రీదేవి కడుపుతో ఉన్న సమయంలో కొట్టిందంట, అతని పెద్ద కొడుకు కూడా ఆమెను ఎంతో వేధించారంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : విడాకుల తర్వాత మొదటిసారి అక్కినేని ఇంట్లో సామ్.. ఫోటో వైరల్



Next Story

Most Viewed