విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్‌పై సమంత పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్‌పై సమంత పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తమ రాబోయే ‘ఖుషి’ సినిమా షూటింగ్ తుర్కియోలో జరుగుతుండగా అక్కడే వీరిద్దరూ లంచ్ డేట్‌కు వెళ్లారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసిన సామ్.. ‘విజయ్ నీ సంతోషాలు, కష్టాలు అన్నీ నాకు తెలుసు. నువ్వు నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నప్పుడు చూశా. జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులనూ చూశా. కొంతమంది స్నేహితులు ఎలాంటి సమయంలోనైనా మనతోనే ఉండిపోతారు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందించిన విజయ్.. సామ్ తన ఫేవరేట్ లేడీ అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మీ జంట చూడముచ్చటగా ఉంది’ అని పొగిడేస్తున్నారు.

Also Read..

‘నేను స్టూడెంట్ సర్’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది: అవంతిక

ఇక్కడ తప్ప.. మరెక్కడ అలాంటి అనుభూతి పొందలేరు: రాధిక

Next Story

Most Viewed