రామ్ చరణ్ సినిమాను రిజక్ట్ చేసిన సమంత.. ఎందుకంటే?

by Disha Web Desk 8 |
రామ్ చరణ్ సినిమాను రిజక్ట్ చేసిన సమంత.. ఎందుకంటే?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ సందడి చేస్తుంది.

మయోసైటీస్ వ్యాధి భారిన పడిన తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ అమ్మడు ఇప్పటికీ ఏ తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదని సమాచారం. అయితే సమంతకు తాజాగా టాలీవుడ్‌లో ఓ బడా హీరో సినిమాలో అవకాశం వచ్చిందంట. కానీ ఆ అమ్మడు దాన్ని చాలా సున్నితంగా రిజక్ట్ చేసిందంట.

అసలు విషయంలోకి వెళ్లితే..బుచ్చిబాబు సనా కాంబోలో త్వరలోనే రాబోయే మూవీలో ఓ కీలక పాత్ర కోసం మూవీ టీ సమంతను కలిసిందంట. వారు క్యారెక్టర్, కథ చెప్పడంతో ఒక్కసారిగా సామ్ షాకై మూవీకి నో చెప్పిందంట. ఎందుకంటే అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు,ఓ ఆంటీ లాంటి రోల్ అంట. ఆ క్యారెక్టర్‌లో సమంతను ఊహించుకోవడం చాలా ఘోరం. అలాంటిది సమంత ఆ సినిమాల్లో నటిస్తదా? రిజక్ట్ చేసి మంచిపని చేసింది అంటున్నారు తన ఫ్యాన్స్. ఇక రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా తెల్సిందే.



Next Story

Most Viewed