చిన్నప్పటినుంచి నేను అంతే.. కష్టమైనదాన్నే ఇష్టపడతాను: సమంత

by Disha Web Desk 10 |
చిన్నప్పటినుంచి నేను అంతే.. కష్టమైనదాన్నే ఇష్టపడతాను: సమంత
X

దిశ, సినిమా: స్టార్ నటి సమంత మరోసారి తన పర్సనల్ అండ్ కెరీర్ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ నిర్వహించిన ఆమె ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా ఆన్సర్స్ చెప్పింది. ఈ మేరకు తనకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టమని, అలాంటి ప్రాజెక్టుల్లో నటించడమంటే ఆసక్తిగా ఉంటుందని తెలిపింది. అందుకే ‘సిటాడెల్’ అవకాశం రాగానే ఎక్కువ ఆలోచించకుండా ఒప్పేసుకున్నానని, తన క్యారెక్టర్ అందరినీ అలరిస్తుందని పేర్కొంది. ‘ఎందుకో తెలియదు. నేను కష్టంగా అనిపించినదాన్నే ఎల్లప్పుడూ ఎంచుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటినుంచి సవాళ్లను ఎదుర్కోవడం నాకు అలవాటైపోయింది. లైఫ్‌లో ప్రతి పని, సినిమాను ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. ‘సిటాడెల్’లోనూ నాకు ఇచ్చిన పాత్రను ఇష్టపడి చేశాను. ఆ యాక్షన్ సీన్స్ మీరందరూ చూడాలని ఎగ్జయిట్‌గా ఎదురుచూస్తున్నా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Next Story