నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటో తెలుసా?

by Disha Web Desk 6 |
నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రజంట్ సినిమాల నుంచి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్‍తో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకునేందుకు కొంత విరామం తీసుకుంది. ఈ టైమ్‌లోనే సడన్‍గా సామ్ ఓ కీలక ప్రకటన చేసింది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా సొంత ప్రొడక్షన్ హౌస్‍ను స్థాపించినట్లుగా ప్రకటించింది. తన ఫేవరెట్ ఇంగ్లిష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’ పాట స్ఫూర్తిగా ప్రొడక్షన్ హౌస్‍కు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరును నిర్ణయించినట్లు తెలిపింది.

అలాగే ‘కొత్త తరం ఆలోచనలను, భావవ్యక్తీకరణలు ఉన్న కంటెంట్‍ను ప్రొడ్యూజ్ చేయడమే తమ లక్ష్యం. మన సామాజిక పరిస్థితుల్లోని సంక్లిష్టతలను, బలాల గురించి తెలిపే కథలను ఆహ్వానిస్తాము. ప్రోత్సహిస్తాము. అర్థవంతమైన, యూనివర్సల్, ప్రామాణికమైన కథలను చెప్పాలనుకుంటున్న వారికి ఇది ఒక ప్లాట్‍ఫామ్‍గా ఉంటుంది’ అని సమంత తెలిపింది. దీంతో తమ వద్ద మంచి కథలు ఉన్నాయంటూ.. తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న నెటిజన్స్.. సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.



Next Story

Most Viewed