వరుణ్ దావన్‌ను అంత మాట అనేసిన సమంత.. హాట్ బ్యూటీ అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరో! పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
వరుణ్ దావన్‌ను అంత మాట అనేసిన సమంత.. హాట్ బ్యూటీ అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరో! పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు యాడ్ షూట్స్ చేస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. మయోసైటీస్ కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్ లేకపోయినా.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా, సమంత వరుణ్ దావన్ చేసిన పోస్ట్‌పై కామెంట్ చేసింది.

వరుణ్ దావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హ్యండ్సమ్ ఫొటో షేర్ చేయగా.. దానికి సామ్ ఎవరీ టీనేజర్ కుర్రాడు అని కామెంట్ పెట్టింది. దీంతో అది చూసిన వరుణ్ ఈ మధ్యనే ఈ కామెంట్ పెట్టిన హాట్ బ్యూటీతో ఒక సిరీస్ చేశాడు అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సామ్, వరుణ్ చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు సామ్ అంత మాట అనేసిందేంటని నెట్టింట చర్చించుకుంటున్నారు. కానీ అదంతా ఫన్నీగా అన్నట్లు తెలుస్తోంది. కాగా, సమంత, వరుణ్ దావన్ జంటగా సీటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. దీనిని రాజ్ డీకే తెరకెక్కించాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed