అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సల్లూ భాయ్.. దీపావళికి చూపిస్తాడట

by Disha Web Desk 10 |
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సల్లూ భాయ్.. దీపావళికి చూపిస్తాడట
X

దిశ, సినిమా: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ 3’ షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు IIFA ఈవెంట్‌ వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు అవార్డ్స్ ఫంక్షన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘ఇన్షాల్లాహ్.. ‘టైగర్ 3’ చిత్రీకరణను పూర్తి చేసాను. మీరంతా దీపావళి రోజున టైగర్‌ను చూస్తారు. ఈ సినిమా చాలా హడావిడిగా షూట్ చేయబడింది. అయినప్పటికీ అవుట్‌పుట్ అంతా బాగానే వచ్చింది. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. కత్రినా కైఫ్ కూడా చాలా కష్టపడింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా అందరినీ ఆశ్చర్యపరుస్తాడు’ అంటూ సినిమాకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించాడు.

Also Read: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సితార.. చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్ట్‌పై సైన్..

Next Story