వద్దన్న వినేవాడు కాదు.. తన తండ్రి గురించి వైరల్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..

by Kavitha |
వద్దన్న వినేవాడు కాదు.. తన తండ్రి గురించి వైరల్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..
X

దిశ, సినిమా: ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. మొదటి సినిమాతో అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్ హీరోయిన్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ చిన్నది అందరి హీరోయిన్‌లలా కాకుండా స్కిన్ షోకు నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక చాలా రోజులకు వరుస సినిమాలతో బిజీ గా మారిన ఈ నేచురల్ బ్యూటీ.. ముందు నుంచి మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే.

సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆమె చేసే స్టెపులు వేరే లెవల్లో ఉంటాయి. దీంతో ఆమె లేడీ ప్రభుదేవా అనే బిరుదు కూడా అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన తండ్రి గురించి పలు ఆసక్తి కరమైన విషయాలు పంచుకుంది.. ‘మూవీ సెట్స్ లో డాన్స్ వేసి ఇంటికి వెళితే టయర్డ్‌గా అనిపించేది. అప్పుడు నాన్న అది గమనించి నా దగ్గరకు వచ్చి కాళ్లు పట్టేవారు. వద్దున్న వినేవాడు కాదు.. చక్కగా మసాజ్ చేసేవారు’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Read More..

న్యూ ట్రెండ్‌లో మెరిసిన రెజీనా.. టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదంటూ పోస్ట్..

Next Story