'తాతగారు మీరింకా ఉన్నారా?'.. వీహెచ్‌పై RGV షాకింగ్ ట్వీట్

by Disha Web |
తాతగారు మీరింకా ఉన్నారా?.. వీహెచ్‌పై RGV షాకింగ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీ- కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాయడంపై ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం ట్వీట్ చేసిన ఆర్జీవీ తాత గారు మీరు ఇంకా ఉన్నారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాసా యాక్ట్ వర్తించదు. టీఏడీఏ యాక్ట్ ని 1995లోనే తీసేశారు. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలంగానే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టింది. ఓ సారి డాక్టర్‌కు చూపించుకోండి అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వర్మ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఆయన మాటలపై పలువురు ప్రముఖులు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్జీవీ కామెంట్స్‌పై వీహెచ్ సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు వర్మకు సెన్స్ ఉందా? ఆయన వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలన్నారు. అవసరం అయితే వర్మపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాయడంపై వర్మ స్పందిస్తూ పై విధంగా కామెంట్స్ చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ వర్మ తాజాగా వీహెచ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడంతో ఈ ఇద్దరి మధ్య వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో అనేది ఆసక్తిగా మారింది.
Next Story