ఇల్లీగల్ రిలేషన్‌తో వార్తల్లోకి ఎక్కిన ‘రేసుగుర్రం’ విలన్.. చాలా ఏళ్లుగా సాగుతున్న తతంగం

by Dishafeatures3 |
ఇల్లీగల్ రిలేషన్‌తో వార్తల్లోకి ఎక్కిన ‘రేసుగుర్రం’ విలన్.. చాలా ఏళ్లుగా సాగుతున్న తతంగం
X

దిశ, సినిమా : ‘రేసుగుర్రం’ విలన్‌గా టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైన భోజ్‌పురి నటుడు రవి కిషన్.. రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. 2016 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. దీంతో ఈ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు. అయితే ఈ టైమ్‌లోనే అపర్ణా ఠాకూర్ అనే మహిళ ఆయన తనను భార్యగా స్వీకరించాలని మీడియాను ఆశ్రయించింది. తన కూతురిని బిడ్డగా అందరి ముందు ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది. 1996లో తనకు, రవికిషన్‌కు పెళ్లి అయిందని.. ఇప్పటికీ తనతో రిలేషన్‌లో ఉన్నాడని చెప్పింది. ఆమె కూతురు కూడా ఇందుకు వత్తాసు పలికింది. ఇంతకు ముందు ఆయనను అంకుల్ అని పిలిచేదాన్నని.. ఈ మధ్యే తన తండ్రి అనే విషయం తెలుసుకున్నానని చెప్పింది.

అయితే రవి కిషన్‌కు ఇప్పటికే ప్రీతి అనే మహిళతో అఫిషియల్‌గా మ్యారేజ్ అయింది. వీరిద్దరికి కూతురు రివా కిషన్ పుట్టింది. అయితే ఈ ఇల్లీగల్ రిలేషన్ ఆరోపణలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ రీమార్క్‌తో ఆయన పొలిటికల్ కెరీర్‌ ఏమౌతుందోనని భయపడుతున్నారు.


Next Story

Most Viewed