రెండు భాగాలుగా భారీ మూవీతో రానున్న Rana Daggubati

by Dishanational2 |
రెండు భాగాలుగా భారీ మూవీతో రానున్న Rana Daggubati
X

దిశ, సినిమా: చివరగా ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మొన్నటికి మొన్న బాబాయ్ వెంకటేష్ తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి వ్యూస్ ని రాబట్టింది. అయితే రానా ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ సినిమా చేయాల్సి ఉంది. కానీ ‘శాకుంతలం’ డిజాస్టర్ అవ్వడంతో గుణశేఖర్ డైలమాలో పడ్డారు. దీంతో రానా ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. గతంలో తేజ, రానా కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ‘రాక్షస రాజు’తో ఇద్దరు మరో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యారు.

Read More:

Rakul Preet Singh : దగ్గుబాటి రానాకి భార్య అవ్వాల్సింది.. కానీ !

63ఏళ్ల నటితో రొమాన్స్ కోరుకుంటున్న 40ఏళ్ల హీరో.. ఆగలేకపోతున్నాడట!

Next Story

Most Viewed