ఉపాసన కాకుండా.. ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటేనే పిచ్చి అంటున్న రామ్ చరణ్..!

by Disha Web Desk 6 |
ఉపాసన కాకుండా.. ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటేనే పిచ్చి అంటున్న రామ్ చరణ్..!
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్స్‌లో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చరణ్, శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న గేమ్ ఛేంజర్ తొందరలో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. గ్లోబల్ స్టార్ బుచ్చిబాబుతో చేసే ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు అని యాంకర్ అడగ్గా? ‘‘ నాకు ఒకరు కాదు ఇద్దరు ఇష్టమైన హీరోయిన్లు ఉన్నారు. వాళ్లు కూడా టాలీవుడ్ వాళ్లు కాదు హాలీవుడ్‌కు చెందిన వారు. జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్. ప్రెట్టీ ఉమెన్ అనే మూవీలో జూలియా నటనకు ఫిదా అయిపోయాను. అలాగే కేథరిన్ సినిమాలు చూసినప్పుడు కూడా చాలా నచ్చుతుంది. వీరిద్దరు నటనను అలాగే కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోతాను. ఈ ఇద్దరు అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఫస్ట్ క్రష్ కూడా’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం చరణ్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉపాసన కాకుండా ఆ ఇద్దరు అంటే ఇష్టమా. ఎవరైనా పెళ్లి జరిగిన తర్వాత భార్యనే ఎక్కువ ఇష్టం అంటారు. కానీ చరణ్‌కు ఆ ఇద్దరంటే ఇష్టమా? పలు రకాలుగా అని చర్చించుకుంటున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అందులో తప్పేముంది.. నటన పరంగా ఎవరినైనా ఇష్టపడవచ్చు. అలాగే భార్య అంటే కూడా ప్రేమ ఉంటుంది అని అంటున్నారు.

Next Story

Most Viewed