మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతున్నాం.. అయినా మాపై వివక్షే

by Disha Web Desk 10 |
మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతున్నాం.. అయినా మాపై వివక్షే
X

దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలో స్త్రీ-పురుషుల మధ్య రెమ్యూనరేషన్ తేడాలపై రకుల్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో మగాళ్లకంటే ఎక్కువగా కష్టపడుతున్నప్పటికీ మహిళలకు తగిన పారితోషికం అందట్లేదంటోంది. ‘ఇప్పటికైనా మేకర్స్ మా టాలెంట్‌‌ను గుర్తించాలి. ఒక సినిమాకోసం ఇద్దరం సమానంగా కష్టపడుతున్నాం. అయినప్పటికీ పైసలు ఇవ్వడంతో హెచ్చుతగ్గులుంటాయి. ప్రేక్షకులను థీయేటర్‌కు తీసుకురావడంతో మా కృషి ఉంటుంది. దీన్ని ఎవరూ గుర్తించట్లేదు. పాత్రకు ఉన్న బలం ఆధారంగానే ఆడియన్స్ ఆదరిస్తారు. కానీ, అది ఎవరు చేశారన్నది కాదు. ప్రియాంక వంటి మహిళలు గ్లోబల్ స్థాయిలో అదరగొడుతున్నారు. ఇప్పటికైనా ప్రతిభ ఆధారంగా పారితోషికం ఇవ్వాలంటూ' రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Read more:

అలాంటి ప్రాజెక్ట్‌ల్లో పనిచేయడం కంటే తోటపని బెటర్ అంటున్న.



Next Story

Most Viewed