తలైవర్ 170 నుంచి వైరల్ అవుతున్న Rajini kanth,Amithab bacchan ఫొటో..

by Anjali |
తలైవర్ 170 నుంచి వైరల్ అవుతున్న Rajini kanth,Amithab bacchan ఫొటో..
X

దిశ, సినిమా: రీసెంట్ గా ‘జైలర్’ తో అద్భుతమైన విజయం అందుకున్న రజినీకాంత్ తన తదుపరి చిత్రం ‘జై భీమ్‌’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ తలైవర్ 170 సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ నిర్మిస్తుండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా తాజాగా మూవీ టీం సెట్స్ నుంచి రజనీ, బిగ్ బి ఫొటోను షేర్ చేయగా.. వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!


Next Story