టాలీవుడ్ స్టార్ హీరోల్లో NTR ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!

by sudharani |
టాలీవుడ్ స్టార్ హీరోల్లో NTR ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మనిషికి తనకంటూ ఓ ఫేవరెట్ హీరో ఉంటాడు. అలాగే హీరోలకు కూడా ఫేవరెట్ హీరోలు ఉంటారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫేవరెట్ హీరోల గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఫేవరెట్ హీరోలు ఏంటి అనుకుంటున్నారా..! అవును మీరు విన్నది నిజమే. ఎన్టీఆర్‌కు నలుగురు ఫేవరెట్ హీరోలు ఉన్నారు. వాళ్లు ఎవరు అంటే.. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్. ఎన్టీఆర్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే.. కచ్చితంగా వీరి నలుగురు గురించి వివరిస్తాడు.

మహేష్ బాబును ఎన్టీఆర్ బ్రదర్‌ల ఫీల్ అవుతారట. ఆయనలో కూల్‌నెస్, హెల్త్ డైట్ అంటే ఇష్టమట. అల్లు అర్జున్‌ను ప్రేమగా బావా అని పిలుస్తారట. బన్నీ, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. అంతే కాకుండా ఆయన డ్యాన్స్ అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టమట. బన్నీ లా బాడీని స్ప్రింగ్‌లా తిప్పేస్తూ చేయాలని చాలా సార్లు ట్రై చేశారట. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రభాస్ డైలాగ్ డెలివరీ అంటే తారక్‌కి చాలా ఇష్టమట. డైలాగ్స్‌ను తన బాడీ మోడ్యులేషన్స్‌లో అప్లికేబుల్ చేసుకొని ఒకే రిథమ్లా లేకుండా సీన్‌కి తగ్గట్టు డైలాగ్స్ డెలివరీ చేస్తూ ఉంటాడట. ఇక ఫైనల్‌గా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి స్నేహం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ అప్పుడే వాళ్లు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. రామ్ చరణ్ అంటే ఎన్టీఆర్‌కు దేవుడు ఇచ్చిన బ్రదర్‌ని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : తలైవర్ 170 నుంచి వైరల్ అవుతున్న Rajini kanth,Amithab bacchan ఫొటో..

Next Story