Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్

by Dishafeatures2 |
Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్
X

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘ది రాజాసాబ్’. ఫేమస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ అయి.. కొనసాగుతోంది. ఇటీవలే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్ అందులో ‘డార్లింగ్’ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ అభిమానుల్లో సంతోషంతోపాటు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభించగా.. హీరోయిన్ నిధి అగర్వాల్ సెట్‌లోకి అడుగు పెట్టింది. అతి త్వరలోనే ప్రభాస్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్, నిధి అగర్వాల్ కీలక సన్నివేశాలతో మొదటి సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ కూడా ఎక్స్‌వేదికగా అప్‌డేట్ ఇచ్చారు. ప్రమోషన్ జర్నీలో భాగంగా మొదటిసాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. దీనికి డైరెక్టర్ మారుతి స్మైల్ సింబల్‌తో రిప్లై ఇవ్వగా, ప్రభాస్ అభిమానులంతా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కచ్చితంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed