థియేటర్స్‌లో ఇక గోలే.. దేవరలో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్?

by Disha Web Desk 8 |
థియేటర్స్‌లో ఇక గోలే.. దేవరలో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ అందింది. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మన హీరో నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి గారాలపట్టీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.




ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? దేవర సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. అయితే ఈ మూవీలో ఐటెం సాంగ్‌లో పూజా హెగ్దే చేయనున్నట్లు సమాచారం. తారక్‌తో కలిసి బుట్టబొమ్మ దేవరలో స్టెప్స్ వేయనున్నదంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ మధ్య పూజాకు ఆఫర్స్ రావడం లేదంట, దీంతో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్.దీంతో తారక్‌కు సరైన పోటీ దొరికింది. ఈ జోడీ స్టెప్స్‌తో థియేటర్స్‌లో ఇక గోలే అంటున్నారు ఫ్యాన్స్.

Next Story

Most Viewed