కదులుతున్న కారులో శృంగారం చేస్తుంటే చూడమని ఫోర్స్ చేసిన సింగర్.. నరకం చూశా.. గోడువెళ్లబోసుకున్న బాధితుడు

by Dishafeatures3 |
కదులుతున్న కారులో శృంగారం చేస్తుంటే చూడమని ఫోర్స్ చేసిన సింగర్.. నరకం చూశా..  గోడువెళ్లబోసుకున్న బాధితుడు
X

దిశ, సినిమా : హిప్ హాప్ స్టార్ మేఘన్ థీ స్టాలియన్‌పై పరువు నష్టం దావా వేశాడు తన కింద పని చేసిన ఫొటోగ్రాఫర్ ఎమిలియో గార్సియా. లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో కేసు ఫైల్ చేసిన ఆయన.. 2022లో స్పెయిన్‌కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను అందులో పేర్కొన్నాడు. కారులో వెళ్తుండగా.. మేఘన్‌తోపాటు తాను మరో మహిళ ఉన్నట్లు తెలిపాడు. అయితే తాను ఉండగానే సింగర్ ఆమెతో సెక్స్ చేయడం ప్రారంభించిందని, తనను చూడాలని ఫోర్స్ చేసిందని చెప్పాడు. కారు దిగుదామనుకున్నా ఆ అవకాశం ఇవ్వలేదన్న ఫొటోగ్రాఫర్.. ఈ ఘటనతో తనకు సిగ్గు వేసిందని, చాలా బాధపడ్డానని తెలిపాడు. పైగా ఈ ఇన్సిడెంట్ తర్వాత తనను ఉద్యోగంలో నుంచి తొలగించిందని చెప్పాడు.

అయితే దీనిపై స్పందించిన సింగర్ లాయర్.. ఇదంతా కేవలం డబ్బు లాగేందుకు చేస్తున్న ప్రయత్నమని, తాము కోర్టులో పోరాడి గెలుస్తామన్నాడు. మేఘన్‌ను దిగజార్చే ప్రయత్నమని, తన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని పేర్కొన్నాడు.

Next Story

Most Viewed