జిమ్‌లో చెమటోడ్చుతున్న పవన్ కల్యాణ్ కుమారుడు Akira Nandan (వీడియో)

by GSrikanth |
జిమ్‌లో చెమటోడ్చుతున్న పవన్ కల్యాణ్ కుమారుడు Akira Nandan (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీలో జరిగే పలు ఫంక్షన్లలో పాల్గొంటూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అకీరా ఎక్కడ కనిపించినా సరే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి ట్రెండ్ చేస్తుంటారు. ముఖ్యంగా అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తల్లి రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. మరోసారి నెట్టింట్లో అకీరా వార్తలు వైరల్‌గా మారాయి. జిమ్‌లో పాటలు వింటూ వర్కౌట్లు చేస్తూ కనిపించారు. ఈ వీడియోలను రేణు దేశాయ్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘తెలుగు పాటలు వింటున్న అకీరాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవిస్తారని ఆశిస్తున్నా’ అని ఇన్‌స్టాలో రేణు దేశాయ్ క్యాప్షన్ ఇచ్చారు.

Also Read: షూటింగ్లో సింగర్ మంగ్లీ కాలికి గాయం.. ఏమి జరిగిందంటే?

Next Story

Most Viewed