తండ్రికి తగ్గ తనయ.. పవన్ కల్యాణ్ కూతురి హైట్ రివీల్ చేసిన రేణుదేశాయ్

by Disha Web Desk 9 |
తండ్రికి తగ్గ తనయ.. పవన్ కల్యాణ్ కూతురి హైట్ రివీల్ చేసిన రేణుదేశాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ కూతురు ఆద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటివరకు ఆమె సినీ రంగ ప్రవేశం చేయకపోయినా రోజూ ఆమె గురించి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఆద్యకు సంబంధించిన విషయాలను తల్లి రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూనే ఉంటుంది. తాజాగా.. ఆద్యకు సంబంధించిన ఓ వార్తలను తల్లి రేణు దేశాయ్ తెలియజేసింది. ఆద్యతో కలిసున్న ఫొటోను షేర్ చేసింది. ‘అవును ఆద్య నాలాగే పొడుగ్గా ఉంది. తన వయసుకు తగినట్లుగా చాలా పొడవుగా ఉంది’ అని క్యాప్షన్ పేర్కొన్నారు. దీనికి ముందు రోజు ఆద్య స్కూల్ గ్రాడ్యుయేషన్ వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేసింది. ఇందులో రేణూ దేశాయ్ తన కూతురిని చూపించింది. పిల్లలు అంతే ఇలా వేగంగా ఎదిగిపోతారన్నట్టుగా క్యాప్షన్ పెట్టేసింది. అంటే ఆద్య ప్లస్ వన్, ప్లస్ టుకి ఎంటర్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇలా గ్రాడ్యుయేషన్‌ వీడియోని షేర్ చేసి రేణూ దేశాయ్ మురిసిపోతోంది.

Next Story

Most Viewed