నుదుటిపై బుల్లెట్ దిగినా.. నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చిన స్టార్ హీరోయిన్

by Disha Web Desk 9 |
నుదుటిపై బుల్లెట్ దిగినా.. నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ( Parineeti Chopra ) నటించింది కొన్ని సినిమాలైనప్పటికీ.. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక చిన్ననాటి స్నేహితుడైన ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపి.. గత ఏడాది రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఈ కపుల్ ఏ వెకేషన్‌కెళ్లినా తాము ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే పరిణితి ప్రస్తుతం ‘అమర్‌సింగ్ చంకీలా’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పంజాబీ నటుడు రొసాంగ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ హిందీ మూవీని ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించారు. శుక్రవారం (ఏప్రిల్ 12) నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. విడుదలైన రోజే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా పరిణితి చోప్రా ఈ చిత్ర షూటింగ్‌లో దిగిన కొన్ని ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ముఖంపై రక్తంతో, నుదుటిపై బుల్లెట్ దిగినట్లుగా ఉన్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story