‘కస్టడీ’ డబ్బింగ్ మొదలుపెట్టిన నాగ చైతన్య..

by Vinod kumar |
‘కస్టడీ’ డబ్బింగ్ మొదలుపెట్టిన నాగ చైతన్య..
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా డబ్బింగ్ పనులు మొదలైనట్లు తెలిపిన హీరో స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫొటోని నెట్టింట షేర్ చేశాడు.

అలాగే ‘నాగ చైతన్య డబ్బింగ్ మొదలుపెట్టారు. త్వరలోనే ఎగ్జయిటింగ్ టీజర్ అప్‌డేట్’ అంటూ మేకర్స్ సైతం ఓ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన మూవీలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించిన సినిమా మే 12న విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి :

ఉమెన్స్ డే స్పెషల్.. సమంత అభిమానులకు గుడ్ న్యూస్

Next Story

Most Viewed