కొత్త టెన్షన్‌లో నాగచైతన్య.. అసలేమైదంటే?

by Disha Web Desk 8 |
కొత్త టెన్షన్‌లో నాగచైతన్య.. అసలేమైదంటే?
X

దిశ, సినిమా : ఎప్పుడూ వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకునే అక్కినేని హీరోలు ఈ మధ్య చాలా డల్ అయినట్లు తెలుస్తోంది. బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున ఖాతాలో మంచి హిట్ అనేది లేదు. అంతే కాకుండా నాగచైతన్య, అఖిల్ నటించిన సినిమాలు కూడా వరసగా డిజాస్టర్స్‌గా మిగిలిపోతున్నాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ చాలా అసహనంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తండేల్ మూవీ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. సముద్రం మెయిన్ థీమ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక నాగచైతన్య కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి ఈ మూవీపై స్పెషల్ ఫొకస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని చాలా కసిగా ఉన్న నాగచైతన్యకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నట్లు ఇండస్ట్రీ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

తండేల్ మూవీ మొత్తం సముద్రంలో అలల మధ్యనే సాగిపోతుదంట. అయితే తాజాగా అరేబియన్ కడలి అనే వెబ్ సిరీస్ ప్రకటించారు . రెండు గ్రామాల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లి దేశపు బార్డర్ క్రాస్ చేస్తే ..ఆ తర్వాత ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేశారనేది వెబ్ సిరీస్ స్టోరీ. ఇక తండేల్ మూవీ స్టోరీ కూడా అదేవిధంగా ఉటుదంట. అయితే తండేల్ మూవీ కంటే ముదే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తండేల్, కడలి వెబ్ సిరీస్ స్టోరీ సేమ్ ఉంటే, నాగచైతన్య మూవీ ఎవరూ చూడరు. ఆ సినిమా హిట్ అందుకోవడం కష్టం అంటున్నారు కొందరు. దీంతో నాగచైతన్య కాస్త అయోమయంలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

Read More..

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్.. కానీ ఓ ట్విస్ట్!

Next Story

Most Viewed