నేను చనిపోతే వాళ్లు ఏమైపోతారో అనే భయం వేస్తుంది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
నేను చనిపోతే వాళ్లు ఏమైపోతారో అనే భయం వేస్తుంది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర నటిగా తన కెరీర్ ప్రారంభించిన మృణాల్.. తన నటనతో, అందంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో వచ్చిన ‘సీతా రామం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ట్రెడిషినల్ బ్యూటీగా యువతతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో బిజీగా ఉంది.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, పర్శనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘సెలబ్రెటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది. అంతే కాదు మన వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చు. కొన్ని కొన్ని సార్లు ఈ వర్క్ కారణంగా ఫ్యామిలీస్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. షూటింగ్‌ల కోసం వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి టైంలో బాధ అనిపిస్తుంది. ఫ్యామిలీకి అవసరమైన సమయంలో ఒక్కోసారి పక్కన కూడా ఉండలేము. నాకు కూడా సాధారణ అమ్మాయిలా బతకాలి అనిపిస్తుంది. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, పిల్లల్నీ కనాలని.. వాళ్లతో కలిసి బయటకు, రెస్టారెంట్లకు తిరగాలని ఉంటుంది. అయితే.. నాకు చావు అంటే చాలా భయం. నేను చనిపోతే మా ఫ్యామిలీ ఏమైపోతుందో అనిపిస్తుంటోంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story