షారుఖ్‌ను ఛీ కొట్టిన భార్య.. టార్చర్ తట్టుకోలేక వదిలేసి పారిపోయిందట..

by Dishafeatures3 |
షారుఖ్‌ను ఛీ కొట్టిన భార్య.. టార్చర్ తట్టుకోలేక వదిలేసి పారిపోయిందట..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఈ జనరేషన్‌కు రోల్ మోడల్. మతాలు వేరైనా గౌరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కింగ్ ఖాన్.. 40ఏళ్లుగా మహారాణిలా చూసుకుంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కాగా బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే షారుఖ్ లవ్ స్టోరీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆ కథేంటో తెలుసుకుందాం.


షారుఖ్ 18ఏళ్ల వయసున్నప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఫస్ట్ టైమ్ గౌరిని చూశాడు. అప్పుడు ఆమెకు 14 ఏళ్లు. చూసిన వెంటనే నచ్చడంతో తనతో డ్యాన్స్ చేస్తావా అని అడగ్గా.. బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని సమాధానమిచ్చింద‎ట. అయితే తను అబద్ధం చెప్పిందని, బ్రదర్ కోసమే అక్కడ ఉందని తెలుసుకున్న షారుఖ్.. తర్వాత కూడా కొన్ని పార్టీల్లో కనిపించడంతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేశాడు. అది కాస్త ప్రేమగా మారింది. కానీ షారుఖ్ పొసెసివ్‌‌నెస్‌తో చేసే టార్చర్ తట్టుకోలేక చెప్పకుండానే ముంబై వెళ్లిపోయంది.కానీ తనకు ఆమె రైట్ పర్సన్ అనుకున్న హీరో ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో రూ.10వేలు ఇచ్చి కోడలిని వెతికి తీసుకురా అని చెప్పిందట. దీంతో ముంబైకి పయనమైన షారుఖ్.. మొత్తం గాలించగా ఒకరోజు బీచ్‌లో గౌరి కనిపించిందట. ఒకరినొకరు చూసుకుని.. ఇద్దరు ఏడ్చేశారట. అయితే మతాలు వేరు కావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందట గౌరి.


Next Story

Most Viewed