రజని సినిమాలో విలన్ గా లారెన్స్..

by sudharani |
రజని సినిమాలో విలన్ గా లారెన్స్..
X

దిశ, సినిమా: తాజాగా ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు రజనీకాంత్. ‘రోబో’ సినిమా తర్వాత మళ్లీ అంతటి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో సూపర్ స్టార్ తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తారనే విషయంపై చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు డైరెక్టర్ లోకేష్ కనకరాజుతోనే సినిమా అని తెలియడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

‘విక్రమ్’ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన డైరెక్టర్ లోకేష్ తాజాగా విజయ్ దళపతితో ‘లియో’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక రజనితో కూడా మరో హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. రీసెంట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఏకంగా రజనిని ఢీకొట్టే విలన్ పాత్రలో రాఘవా లారెన్స్ నటించిన బోతున్నాడు. మరి ఇతర నటీనటులు ఎవరనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Next Story

Most Viewed